మునుగోడు ఫ్లోరైడ్ తో అల్లాడుతున్న పట్టించుకోని నాటి నేతలు

జనజీవనం ఇబ్బంది అంటూ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ సూచనలు బేఖాతరు
– సీఎం కేసీఆర్ హయంలో తరిమికొట్టిన ఫ్లోరైడ్
– మంత్రి జగదీష్ రెడ్డి
నల్గొండ బ్యూరో జనం సాక్షి .
దశాబ్దల కాలంగా మునుగోడు నియోజకవర్గం క్లోరైడ్ బారినపడి జనజీవనం అతలాకుతలం అవుతున్నప్పటికీ నాటి నేతలు పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ హయంలో ఫ్లోరిన్ భూతాన్ని తరిమికొట్టారని జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మునుగోడు మండలంలోని కిష్టాపురం గ్రామంలో గొర్రెలకు పశువులకు వాక్సినేషన్ ను ప్రారంభించిన అనంతరం పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ లతో కలసి వదిలిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఫ్లోరైడ్ బారిన పడి నియోజకవర్గంలో మనుషులు జీవించే పరిస్థితి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు ఇచ్చినప్పటికీ ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదని తెరాస అధికారంలో రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లోరైడ్ పై ప్రత్యేక దృష్టి పెట్టి పారడోలాడని అన్నారు. దార్శనికుడు కేసీఆర్ వల్లనే బీడుగా మారిన నియోజకవర్గ మొత్తం పచ్చటి పొలాలు దర్శమిస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాకతీయ పథకంతో చెరువులు పూర్వ వైభవం సంతరించుకున్నాయని, తెలంగాణలో సబ్బండవర్గాలు సంతోషంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. మత్స్య కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలోనే తెలంగాణ మత్స్యకారులు అధికంగా చేపలను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఇది తెలంగాణకే గర్వకారణం అని, సందర్భం ఏదైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట నడవాలని పిలుపునిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యమ కాలం నుండి తెలంగాణ ఎలా ఉండాలో, ఎలా బాగు చేయాలో సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికలతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కులవృత్తులకు జీవం పోసి, వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని, మునుగోడు కు వచ్చిన ప్రతిపక్షాలన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నేతలకు మోకాళ్లలో ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చి ఏదేదో వాగిపోతున్నాడని, అసలు బిజెపి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి టైం పాస్ చేసి పోతున్నారని ఎద్దేవా చేశారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని సీఎం కెసిఆర్ ప్రపంచ స్థాయిలో అద్భుత నిర్మాణాన్ని చేపట్టారన్నారు, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలియజెప్పాలని డిమాండ్ చేశారు, మునుగోడులో బిజెపికి మూడో స్థానం అని, గొర్రెల పంపిణీ నిరంతర ప్రక్రియ గా మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పట్ల బిజెపికి ఎలాంటి అవగాహన లేదని దుయ్యబట్టారు.2016 ఆసరా ఫించన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దేశవ్యాప్తంగా కేవలం తెలంగాణలోని వృద్ధులు వికలాంగులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు, ఆడపిల్లల తల్లిదండ్రులకు త్వరలో మారిందన్నారు, ఎన్నికల సమయంలో ప్రజలు ఆందోళన పడి ఓటు చేయొద్దని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫిష్ అండ్ గోట్ చైర్మన్ బాలరాజు యాదవ్. డిడ చైర్మన్ మోతే పిచ్చి రెడ్డి. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు