మున్నూరు కాపు సంఘం వినాయకునికి పూజలు చేసి శోభ యాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కలెక్టర్ వరుణ్ రెడ్డి ,జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 26

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్నూరు కాపు సార్వజనిక్ గణేష్ మండలి వద్ద వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పటేల్ వినాయక నిమజ్జనం సందర్బంగా స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను పూర్తిచేసిన మున్సిపాల్ అధికారులు
ఈ సందర్భంగా కలెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ. భైంసా పట్టణానికి వినాయక చవితి కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు చేశామని యువకులు ప్రజలు నిమర్జనాన్ని ఉత్సాహంగా చేసుకుని భైంసా పట్టణం అభివృద్ధి బాటలో నడుస్తుందని దీని ఇలాగే కొనసాగించాలని ఎలాంటి అవంచనియ సంఘటనలకు తావివ్వకుండా ఘనంగా గణేష్ నిమర్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ అన్నారు. భైంసా న్యాయస్థానంలో మట్టి వినాయకుని పూజలు చేసి శోభ యాత్ర ను లాయర్లు అందరూ కలిసి సంప్రదాయ రీతిలో బాజెంత్రిలతో నిమజ్జనం చేశారు చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి నృత్యాలు చేస్తూ ముందుకు వెళ్ళారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, స్థానిక ఏ ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పటేల్, పట్టణ సీఐ ఎల్ శ్రీను ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షులు రమాదేవి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవర్ రామారావు పటేల్, మోహన్ రావు పటేల్, ఉత్సవ సమితి సభ్యులు తదితరులు ఉన్నారు