మున్సిపల్ పారిశుద్య ప్రైవేటీకరణ ఆపాలి
విజయనగరం,ఆగస్ట్14(జనం సాక్షి): మున్సిపాలిటీలో జీఓ 279 ను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక గంట స్తంభం వద్ద మంగళవారం రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి.రమణ మాట్లాడుతూ.. జీఓ వలన ప్రజలపై భారాలు పడనున్నాయన్నారు. 279 జీఓ ప్రకారం పారిశుధ్యం ప్రైవేటీకరణ చేయడం సక్రమంగా అమలు కాదని, పట్టణంలో జ్వరాలు పెరుగుతున్నాయని తెలిపారు. పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోకుండా బలవంతంగా జీఓ అమలు చేయడాన్ని చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. జీఓ అమలు విూద ఉన్న శ్రద్ధ పరిశుధ్యంపైన అధికారులకు లేదన్నారు. 10 శాతం అదనంగా చెలించి ప్రజలపై భారాలు వేయడాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.