మున్సిపాలిటీఎన్నికల్లోతృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీక్లీన్‌స్వీప్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తనకు తిరుగులేదని సీఎం మమతా బెనర్జీ నేతృంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (TMC) మరోసారి నిరూపించుకున్నది. రాష్ట్రంలోని నాలుగు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ దిశగా దూసుకుపోతున్నది. టీఎంసీ దూకుడు ముందు ఒక్క మున్సిపాలిటీలో కూడా బీజేపీ నిలువలేకపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వని కమలం పార్టీ రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే ఖాతా తెరిచింది.

రాష్ట్రంలోని సిలిగురి, బిద్ధన్‌నగర్‌, ఛందన్నగోరె, అసన్‌సోల్‌ మున్సిపాలిటీలకు గత శనివారం పోలింగ్‌ జరిగింది. నేడు ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో సిలిగురిలోని 35 స్థానలకు ఎన్నికలు జరగగా టీఎంసీ 31 స్థానాల్లో దూసుకుపోతున్నది.

అదేవిధంగా బిద్ధన్‌నగర్‌లో 41 స్థానాలకు గాను 39 చోట్ల, ఛందన్నగోరేలో 20 సీట్లలో 19, అసన్‌సోల్‌లో 55 స్థానాలకుగాను 50 సీట్లలో టీఎంసీ లీడ్‌లో ఉన్నది. సిలిగురి, అసన్‌సోల్‌లో మాత్రమే బీజేపీ ఖాతా తెరిచింది. సిలిగురిలో 2 చోట్ల, అసన్‌సోన్‌లో 4 స్థాల్లో ముందంజలో ఉన్నది.