మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటుతాం

` అర్హులైన పేదలకు రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు
` ప్రజల జీవన ప్రమాణాలు పెంపునకు ప్రభుత్వం కృషి
` 96 లక్షల కుటుంబాలకు రేషన్‌ ద్వారా సన్న బియ్యం సరఫరా..
` 800 మెగా వాట్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం
` రూ.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా
` పేదలకు అండగా ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు బలోపేతం చేయాలి..
` డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
గోదావరిఖని(జనంసాక్షి):ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుదిల్ల శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ , ప్రభుత్వ సలహాదారు హర్క వేణుగోపాల్‌ జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు, జే.అరుణ శ్రీ డి. వేణు, ఎమ్మెల్యేలు మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, లతో కలిసి రామగుండంలో పర్యటించి నగరంలో వివిధ డివిజన్‌ లలో 80 కోట్ల 52 లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు, టి.యూ.ఎఫ్‌.ఐ.డి ద్వారా 88 కోట్ల 90 లక్షల రూపాయలతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్‌ లైన్‌ నిర్మాణ సరఫరా, ఆర్‌డబీ శాఖ ద్వారా చేపట్టనున్న 6.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నగరంలో నిర్మించిన 633 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను లబ్ధిదారులకు ,494 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడిరగ్స్‌ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రామగుండం జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఢల్లీిలో బడ్జెట్‌ తయారీ సంబంధిత సమావేశం ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే పట్టుబట్టి ఈ కార్యక్రమానికి తనను రప్పించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయడం ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన కీలకమైన అంశమని, రాష్ట్ర క్యాబినెట్‌ లోని మంత్రులందరిపై ఒత్తిడి పెంచుతూ రామగుండం ప్రాంతానికి అవసరమైన పనులు స్థానిక ఎమ్మెల్యే చేయించుకుంటున్నారని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. గత పాలకులు పేదలకు వ్యతిరేకంగా పని చేశారని , ప్రజల కష్టాలను చూసి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజులలో ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్‌ మార్చ్‌ పేరిట పాదయాత్ర నిర్వహించి, ఈ ప్రాంత సమస్యలను ఆనాడే గుర్తించడం జరిగిందని అన్నారు. పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరమే 22 వేల 500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందని అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. పేద ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసినప్పుడే ప్రభుత్వానికి సంతోషం ఉంటుందని అన్నారు. 96 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ప్రతినెల ఉచితంగా సరఫరా చేస్తుందని అన్నారు. 29 లక్షల వ్యవసాయ పంప్‌ సెట్లకు 24 గంటల త్రీ ఫేస్‌ విద్యుత్తు , 52 లక్షల పైగా నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, 8600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు.పేద మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్‌ ఎకానవిూ ఆర్థిక శక్తిగా తెలంగాణ అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాలకుర్తి ఎత్తిపోతల పథకం పనులు త్వరలో చేపడతామని అన్నారు.స్థానికంగా రామగుండం ప్రాంత ప్రజలకు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ తో భావోద్వేగ సంబంధం ఉందని, ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్‌ బాబు కృషి మేరకు రాష్ట్ర క్యాబినెట్‌ రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.శ్రీపాద ఎల్లంపల్లి ,ఎన్టిపిసి , సింగరేణి, కేశోరాం సిమెంట్స్‌, ఎరువుల కర్మాగారం వంటి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ప్రాంతంలో 10 సంవత్సరాలపాటు ఎటువంటి ప్రాజెక్టులు గత పాలకుల హాయంలో తేలేదని డిప్యూటీ సీఎం విమర్శించారు. సింగరేణి కాలరీస్‌ సంస్థ కాపాడేందుకు రేర్‌ ఎర్త్‌ మేటిరియల్స్‌ మైనింగ్‌ లో కూడా భాగస్వామ్యం అయ్యేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు, జెన్‌ కో, డిస్కంలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం కోటి రూపాయల ప్రమాద బీమా కల్పించిందని, అదే రీతిలో రాష్ట్రంలో పనిచేసే ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోటి రూపాయల బీమా ప్రభుత్వం ప్రారంభిస్తుందని అన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నెర వేరుస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఉగాది నుంచి పేదలకు సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్‌ కార్డులు పంపిణీ చేశామని అన్నారు. గత పాలకుల హయాంలో పేదల కోసం ఇల్లు నిర్మించ లేదని వారి కోసం మాత్రం పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 22 వేల 500 కోట్లతో మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.రాజకీయాలకతీతంగా నిరు పేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశామని, రాబోయే 3 సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు మార్చకుండా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను మౌలిక వసతులు కల్పించి అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న అబద్ధపు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నగరంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా తప్పనిసరిగా పరిష్కరిస్తామని అన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వెనుకబడిన రామగుండం ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సింగరేణి మెడికల్‌ బోర్డు నుంచి కార్మికులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్నతనంలో తాము చదువుకున్న పాఠశాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని అన్నారు. ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణాన్ని ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఎమ్మెల్యే కు సూచించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 10 నుంచి 15 సంవత్సరాలు పెండిరగ్‌ ఉన్న అంశాలను పరిష్కరించి నేడు 1700 పైగా నిరుపేద కుటుంబాలకు వివిధ పథకాల ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.మేడిపల్లి గ్రామంలో దారిద్ర రేఖ దిగివకు ఉన్న 212 నిరుపేద కుటుంబాలకు, జనగామ గ్రామంలో 31 మంది ట్రాన్స్‌ జెండర్లకు, గోదావరిఖనిలో వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన 129 మంది పేద కుటుంబాలకు, మారేడు పాక గ్రామంలో చాలా కాలంగా పెండిరగ్‌ ఉన్న సింగరేణి భూ సమస్య పరిష్కారం చేసి 162 కుటుంబాలకు, జిఓ 76 పెండిరగ్‌ దరఖాస్తులు పరిష్కరించి పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. నేడు పట్టాలు పంపిణీ చేసిన 633 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లబ్ధిదారులు 2 నెలల లోపు గృహప్రవేశం చేసే విధంగా అవసరమైన డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. రామగుండం నగర వ్యాప్తంగా 494 మంది నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడిరగ్‌ కాపీలను అందిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు.ఇళ్ల పట్టాల పంపిణీ మాత్రమే కాకుండా రామగుండం నగర అభివృద్ధి కోసం 169 కోట్ల పైగా నిధులతో చేపట్టిన త్రాగునీటి సరఫరా, సివరేజ్‌ ప్లాంట్ల నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. Iగత రెండు సంవత్సరాల కాలంలో రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో 562 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్‌ తెలిపారు.ఎమ్మెల్యే మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పాటు రామగుండం నగరాన్ని అప్పటి పాలకులు నిర్లక్ష్యానికి గురి చేశారని అన్నారు. 800 మెగా వాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులను ప్రభుత్వం గుర్తించి సంస్థ లాభాల్లో వాటా కింద బోనస్‌ అందించిందని అన్నారు. మేడిపల్లి లో పీపీఏ పద్దతులో విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో వైఎస్‌ఆర్‌ 18 వేల నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేశారని, మరో 7 వేల పేదలకు పట్టాల పంపిణీ అవసరం ఉందని అన్నారు. రామగుండం నగరంలో మరో తహసిల్దార్‌ కార్యాలయం, జూనియర్‌ కళాశాల భవనం అవసరం ఉందని , వెంటనే మంజూరు చేయాలని కోరారు. ట్రాన్స్‌ జెండర్‌ సంక్షేమం కోసం ప్రభుత్వం మొదటి సారి హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ పోలీస్‌ ఉద్యోగం అందించారని, నేడు మన రామగుండం లో మరో 50 మంది ట్రాన్స్‌ జెండర్‌ లకు ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.రామగుండం జనరల్‌ ఆసుపత్రి నిర్మాణానికి మరో 50 కోట్ల మంజూరు చేసి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. వ్యాపార, వైద్య, పర్యాటక కేంద్రంగా రామగుండం అభివృద్ధి చేస్తామని తెలిపారు. రామగుండం లో దేవాలయాలను పురావస్తు శాఖ ద్వారా 12 కోట్ల అభివృద్ధి చేయాలని కోరారు. నగరంలో నిర్మించిన 700 ఇండ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేశామని, పెండిరగ్లో ఉన్న మరో 150 ఇండ్లకు నిదుర మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ఇచ్చిన హావిూ మేరకు అంతర్గా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను పూర్తి చేసామని, అదేవిధంగా ప్రభుత్వం పాలకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు 450 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, డిపిఆర్‌ తయారీ పనులు వేగవంతం చేయించాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణు, జే.అరుణశ్రీ, డిసిపి రాంరెడ్డి, రెవెన్యూ డివిజన్‌ అధికారి బి.గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌ , పిడి హౌసింగ్‌ రాజేశ్వరరావు,ప్రజా ప్రతినిదులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక
` ప్రపంచానికి జాతరను పరిచయం చేస్తాం
` జాతర కోసం రూ.260 కోట్లు వెచ్చిస్తున్నాం
` 15కల్లా జాతర పనులు పూర్తి
` మేడారం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
` ప్రతివారం ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు మంజూరు చేస్తామని వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):సమ్మక్క సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదు ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు ఆత్మ గౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో జాతర పనులను మంత్రులు శ్రీధర్‌ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ తో కలిసి జాతర ఏర్పాట్ల పై సవిూక్షించి తదుపరి విూడియా తో మాట్లాడారు. ఆతరువాత అమ్మవారులను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు. ఈ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 260 కోట్లు ఖర్చు చేస్తుందని ఇందులో జాతర నిర్వహణ కోసం 150 కోట్లు శాశ్వతంగా గుడి నిర్మాణ పనులకు గాను 110 కోట్లు విచ్చిస్తున్నట్టు వివరించారు. నిధుల ఖర్చు చేయాల్సిన పనులు అన్ని విషయాలను మేడారంలో సవిూక్షించి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు చేసినట్టు డిప్యూటీ సీఎం విూడియాకు వివరించారు. రెండు రోజుల్లో పనులు పూర్తి కాబోతున్నాయని తెలిపారు. ఇప్పటికీ జాతర పనులు సగటున 85శాతం పూర్తి చేశారు, మిగిలిన పనులు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. జాతర సందర్భంగా అవసరమైన నిధులు విడుదల చేశాం, పూర్తి చేసిన పనులకు 24గంటల్లో బిల్లులు మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. గతం లో జాతర నిర్వహణకు 75 కోట్లు, 100 కోట్లు ఖర్చూ చేస్తే తమ ప్రభుత్వం 260 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రధానంగా ఆరోగ్య, విద్యుత్‌ శాఖ అధికారులు జాతర పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని వీరితో పాటు యావత్‌ శాఖల సిబ్బంది అధికారులు జాతర ను సీరియస్‌ గా తీసుకోవాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లు.. ప్రతివారం బిల్లులు మంజూరు చేస్తాం: భట్టి
పెద్దపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు అందజేస్తోందని గుర్తుచేశారు. ప్రతివారం బిల్లులు మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి గోదావరిఖనిలో పర్యటించారు. రామగుండం కార్పొరేషన్‌లో రూ.175 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యుత్‌ వినియోగదారులకు డిప్యూటీ సీఎం భట్టి లేఖలు
రాష్ట్రంలోని సుమారు 83 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖలు రాశారు. వాటిని విద్యుత్‌ అధికారులు స్వయంగా వెళ్లి వినియో గదారులకు అందజేస్తున్నారు. భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు.. విద్యుత్‌ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, డిప్యూటీ సీఎం సందేశంతో కూడిన లేఖలను గృహజ్యోతి లబ్ధిదారులు, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు అందజేస్తున్నారు. వినియోగదారుడి పేరు, సర్వీస్‌ కనెక్షన్‌ నంబర్‌తో వ్యక్తిగతంగా ప్రస్తావిస్తూ రాసిన ఈ లేఖలను దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు స్వయంగా వినియోగదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 52,82,498 మంది గృహజ్యోతి లబ్ధిదారులు, 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులు ఈ లేఖలు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.