ముల్కనూర్ అంబులెన్స్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అధికార

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (19) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండల ముల్కనూర్ లో 108 సేవలు అందిస్తున్నటువంటి అంబులెన్స్ ను హనుమకొండ జిల్లా 108 అధికారి విజేందర్  ఆకస్మికంగా తనిఖీ చేశారు విధుల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మేకల రవి మరియు పైలెట్ మథిన్ పాషా ఉండగా అంబులెన్స్ పనితీరును రికార్డులు పరిశీలించి  మెడికల్ ఎక్విప్మెంట్ పనితీరు పరిశీలించారు అనంతరం ముల్కనూర్ 108 సిబ్బంది పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ భీమదేవరపల్లి మండలంలోని ప్రజలందరూ ఎటువంటి అత్యవసర సమయంలో ఐనా 108 సేవలను ఉపయోగించుకోవాలని గోల్డెన్ అవర్ లో సరైన వైద్యం అందినట్లయితే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆయన తెలిపారు