ముస్త్యాల లో ఈవీఎం మిషన్ పై అవగాహన
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో శుక్రవారం ఈవీఎం మిషన్, వివి ప్యాడ్స్ లపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ.. ఓటు హక్కు కలిగిన వారికి, 18 సంవత్సరాలు దాటిన వారికి ఈవీఎం మిషన్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అని అన్నారు. ఈవీఎం యంత్రం ద్వారా ఓటు ఎలా వేయాలో గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏయివో అరవింద్ శ్రీనివాస్, పిసి సమ్మయ్య పాల్గొన్నారు.