ముస్లింలపై వేధింపులు – ట్రంప్
ఎప్పుడూ ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ముస్లింలు, ఆఫికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్లపై వేధింపులు జరుగుతుండటం చాలా విచారాన్ని కలిగిస్తోందని, వెంటనే అలాంటి చర్యలు ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాంటి చర్యలు నిజంగా దేశానికి ఉపయోగపడితే తాను వాటికి మద్దతిస్తానని, కానీ, అలాంటివి సరికానందున వెంటనే ఆపాలని కోరారు. ‘ముస్లింలపై వేధింపులు జరుగుతున్నాయని తెలిసి నేను చాలా విచారిస్తున్నాను. దయచేసి వాటిని ఆపేయండి.. నిజంగా అవి సహాయపడితే అది కరెక్టే అని చెప్తాను’ అని ట్రంప్ ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికా సమాజంలోని కొన్ని వర్గాలు తనను చూసి భయపడుతున్నాయని, ఎందుకంటే వారికి తాను తెలియదని, అయితే, వారు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని తాను చెప్పదలుచుకున్నానని అన్నారు.