మూకోన్మాద దాడులు దురదృష్టకరం

– ఫేక్‌ న్యూస్‌ వల్లే అధికశాతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి
– ప్లాట్‌ఫామ్‌లపై చెకింగ్‌ వ్యవస్థను ఇన్‌స్టాల్‌ చేయాలని సోషల్‌ విూడియా సంస్థలను ఆదేశించాం
– పార్లమెంట్‌లో కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
– రాజ్యసభ్యలో చర్చించిన సభ్యులు
న్యూఢిల్లీ, జులై19(మూకోన్మాద దాడులు దురదృష్టకరం) : మూకోన్మాద దాడులను కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ఖండించారు. మూకస్వామ్య దాడులు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పారు. వాటిలో ఎక్కువ శాతం సంఘటనలు ఫేక్‌ న్యూస్‌ వల్లే జరుగుతున్నాయన్నారు. సోషల్‌ విూడియా ఆధారంగా జరుగుతున్న దాడులపై  లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడారు. శాంతిభద్రతలు రాష్టాల్ర పరిధిలోకి వస్తాయని, దీనిపై గతంలో రెండుసార్లు ఆయా రాష్టాల్రకు ఆదేశాలు ఇచ్చామన్నారు. తమ ఫ్లాట్‌ఫామ్‌లపై చెకింగ్‌ వ్యవస్థను ఇన్‌స్టాల్‌ చేయాలని సోషల్‌ విూడియా సంస్థలకు ఆదేశించినట్లు తెలిపారు. మూకోన్మాద దాడులు దురదృష్టకరమన్నారు. ఘటనలు జరిగిన రాష్టాల్ర సీఎంలతో తాను స్వయంగా మాట్లాడానని, ఉన్మాదులను అరెస్టు చేయాలని సూచించినట్లు చెప్పారు. అటు ఈ అంశంపై రాజ్యసభలో కూడా చర్చించారు. సోషల్‌ విూడియాను కొందరు ఉన్మాదులు దుర్వినియోగం చేస్తున్నారని బీహార్‌ ఎంపీ హరివంశ్‌ ఆరోపించారు. క్యాంబ్రిడ్జ్‌ అనలిటికా, అమెరికా ఎన్నికల్లో రిగ్గంగ్‌ లాంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోషల్‌ విూడియాలో వ్యాపిస్తున్న వదంతుల వల్ల జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు. సోషల్‌ విూడియా నియంత్రణపై ఓ విధానాన్ని తయారు చేయాలని కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై జరిగిన దాడి అంశాన్ని సీపీఐ నేత టీకే రంఘరాజన్‌, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఈ దాడిని ఖండించాలని వాళ్లు డిమాండ్‌ చేశారు. అటు సోషల్‌ విూడియా నియంత్రించేందుకు విధానాన్ని రూపొందించాలని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రభుత్వాన్ని కోరారు. సోషల్‌ విూడియా సంస్థలతో ఈ అంశం గురించి చర్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.