మూడోప్రత్యామ్నాయం దిశగా వామపక్షాల యత్నం
ప్రత్యేక¬దా లక్ష్యంగా కార్యాచరణ
టిడిపి, వైకాపాలు విఫలమయ్యాయన్న రామకృష్ణ
విజయవాడ,జూలై23(జనంసాక్షి): రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయానికి వామపక్షాలు సిద్ధమయ్యాయి. ఎన్నికలకు దగ్గర పడుతున్న తరుణంలో వివిధ సమస్యలతో ముందుకు వస్తున్నాయి. ప్రధానంగా ప్రత్యేక¬దా సమస్యను ముందుకు తీసుకుని వెళుతున్న దశలో టిడిపి, వైకాపాలకు ప్రత్యామ్నాయంగా కూటమితో సాగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఏపీ అభివృద్ధి, ప్రత్యేక ¬దా సాధనలో అధికార, ప్రతిపక్షాలు విఫలమైనందున మూడో ఫ్రంట్ అవసరం ఏర్పడిందన్నారు. జనసేనతోపాటు భావసారూప్యత కలిగిన పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని పోతామన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా రాకపోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్ వైఖరే కారణమని విమర్శించారు. ¬దా అంశాన్ని ఇద్దరూ రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటున్నారని ప్రధాని మోదీకి తెలిసిపోయినందునే ఇవ్వడం లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండా బయట నుంచి నిరసన వ్యక్తం చేయటం కూడా పెద్ద డ్రామా అని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ముందుకు రావడం ముదావహం అన్నారు. . కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మోడీ చంద్రబాబు ద్వయం గత సార్వత్రిక ఎన్నికలో ఇచ్చిన హావిూలు నమ్మి వారిని అందలమెక్కించిన ప్రజలకు నిరాశే మిగిలింది. గతంలో మాదిరి కేంద్రీకరణ నమూనాను అనుసరించడంతో అభివృద్ధి ఒకటి రెండు ప్రాంతాలకే దక్కి మిగిలినవన్నీ వెనుకబడుతున్నాయి. అదే విధంగా సంపన్నుల కొమ్ముకాసే చర్యలవల్ల సామాన్యులకు లాభం జరగడం లేదని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మాత్రం తాను అధికారంలోకి రావడమే
పరిష్కారం అని ప్రకటిస్తోంది. కాని ఒక పార్టీ బదులు ఇంకొక పార్టీ రావడంవల్ల ప్రజల జీవితాల్లో మార్పు రాదు. అది ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల ద్వారానే సాధ్యం. అవకాశవాద కలయికలు, కూటములు కాకుండా విధాన ప్రాతిపదికగా రాజకీయ సవిూకరణకు కమ్యూనిస్టులు పూనుకోవడం శుభ పరిణామం అన్నారు. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనార్టీ తరగతుల సమస్యల పరిష్కారానికి రాయితీలు కల్పించడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక న్యాయం అంటే సమాజంలో అట్టడుగున ఉన్న దళితులు, ఆదివాసీలు, బడుగు బలహీనవర్గాలవారు ఇతర కులాలతో పాటు సమానంగా అభివృద్ది కావడం. అంటరానితనం, కుల వివక్ష అంతం కావాలి. బలహీనులపై దాడులు చేసిన మోతుబరులతో రాజీ కుదిర్చే అధికార యంత్రాంగం తీరు మారి, ‘చట్టం తన పని తాను చేసుకునేలా’ రూపొందడం విధానాల మార్పు ద్వారానే సాధ్యం. ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతలకు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడంలేదు. వారి కష్ట ఫలితం వారికి దక్కితేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అప్పుడో ఇప్పుడో నష్ట పరిహారం లేదా సబ్సిడీ ఇవ్వడం కాకుండా పంట పండించడానికి చేసిన ఖర్చుకు 50 శాతం అదనంగా ధర రైతుకు చెల్లించేలా చట్టం చేయాలి. అదే విధంగా కార్మికులకు కనీసవేతనం 18 వేలు చెల్లించడంతోపాటు, కార్మిక చట్టాలను పటిష్టపర్చడం అవసరం. కౌలురైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపట్ల ప్రత్యామ్నాయ కార్యక్రమం స్పష్టమైన డిమాండ్లు రూపొందించింది. యువ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మెడ విూద కత్తిలా వేలాడుతున్న సిపిఎస్ విధానాన్ని తెచ్చింది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేస్తున్న ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర పాలక పార్టీలు ఖజానాను సంపన్నులకు దోచిపెట్టడమేగాక అవినీతిని పెంచి పోషిస్తున్నాయి. ప్రపంచబ్యాంకు ఆదేశిత సంస్కరణలు, జలయజ్ఞం వగైరా అవినీతి అందరికీ తెలిసిందే! అవినీతి రహితంగా ప్రభుత్వ పాలన, పారదర్శకంగా నిర్ణయాలు, పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు వంటి అంశాలను ప్రత్యామ్నాయ కార్యక్రమం పేర్కొంది. రాజకీయ అవినీతిని అంతం చేయడం ప్రత్యామ్నాయ శక్తులకే సాధ్యం. నవ్యాంధప్రదేశ్ సమగ్రాభివృద్ధికి, సామాజిక న్యాయ సాధనకు, ప్రజా సంక్షేమ కల్పనకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ కార్యక్రమం నిస్సందేహంగా ఒక ముందడుగు అని రామకృష్ణ వివరించారు.
——–
—
—-
——————
——————-
————–
——————