మూడ్రోజుల పాటు అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): అమర్‌నాథ్‌ యాత్రను ప్రభుత్వం మూడు రోజలపాటు రద్దు చేసింది. నేటి నుంచి 23 వరకు వరకు లోయలోకి ఒక్కరిని కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే, యాత్రను ఎందుకు రద్దు చేసిందన్న వివరాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు. బుధవారం బక్రీద్‌ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఈ నెల 26తో యాత్ర ముగుస్తుండడంతో యాత్రికుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం భగవతి నగర్‌ యాత్రి నివాస్‌ నుంచి కేవలం 43 మందితో కూడిన యాత్రికుల బృందం లోయలోకి బయలుదేరింది. జూన్‌ 28న అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటి వరకు 2.82 లక్షల మంది భక్తులు అమరనాథుడ్ని దర్శించుకున్నారు. గత మూడేళ్లతో పోలిస్తే ఇంతమంది దర్శించుకోవడం ఇదే తొలిసారి.