మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కలపెల్లి
ఖానాపురం సెప్టెంబర్ 19జనం సాక్షి
మండలంలోని అయోధ్య నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నునావత్ సమ్మయ్య అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అలాగే మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈకార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గుగులోతు జగన్, వార్డు సభ్యులు గుండ్ల యాకయ్య, వీరన్న, బద్రు, గుగులోతు జగన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, కదిరి సారయ్య, రాజు, వరదయ్య, మల్లేశం, విజయ్, కొంతం రాజు, బైరి స్వామి తదితరులు పాల్గొన్నారు.