మృతుని కుటుంబాన్ని పరామర్శించిన తెరాస నేతలు*
రేగొండ : ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను టిఆర్ఎస్ నేతలు పరామర్శించి ఓదార్చారు. మండల కేంద్రంలోని పెద్ధంపల్లి గ్రామంలో టి ఆర్ ఎస్ కార్యకర్తలు పసుల శంకర్, మడికొండ సురేష్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్ ఒక్కో కుటుంబానికి ₹ 2 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, రేగొండ స్థానిక ఎంపిటిసి మైస సుమలత భిక్షపతి, పెద్దంపల్లి సర్పంచ్ పసుల ప్రియాంక రత్నాకర్, కొటంచ ఆలయ డైరెక్టర్ గండి తిరుపతి గౌడ్, జిల్లా యూత్ నాయకులు ఎడ్ల అనూష్ రెడ్డి, తాల్లపెల్లి రాజు, పెద్ధంపళ్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శిలమంతుల నర్సింహ మూర్తి, పెద్ధంపల్లీ గ్రామ యూత్ అధ్యక్షులు కోడేపాక దిలీప్, తెరాస నాయకులు గుంటోజు కిషన్ చారి, గోగుల చంద్రాకర్ రెడ్డి, దోపతి సమ్మిరెడ్డి, గ్యారంపెల్లి రాజేశ్వర్ రావు, మడికొండ సాంబయ్య, కోడెపాక సుధాకర్, ధాట్ల అశోక్, గుర్రం రమేష్, వజ్జీరు సాంబయ్య, కోడేపాక నర్సయ్య, వజ్జీరు సుధాకర్, బోరాల సుధాకర్, వజ్జీరు శ్రీను, పసుల ప్రభాకర్, మడికొండ రామయ్య, తదితరులు పాల్గొన్నారు.