మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.

తాండూరు అగస్టు 31(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నరేందర్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతు మంగళవారం స్వర్గస్తులయ్యారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బుధవారం నరేందర్ గౌడ్ నివాసానికి చేరుకుని శాంతమ్మ పార్థ దేహానికి పూలమాలవేసి నివాళు లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.శాంతమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, పిఎసిఎస్ చైర్మన్ రవి గౌడ్,జిల్లా ప్రణాళిక సంఘం మెంబర్ పట్లోళ్ళ నర్సింహులు, బాగ్వన్,మృతురాలు కుటుంబ సభ్యులు ,తదితరులు .