*మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన గండ్ర.

చిట్యాల18( జనం సాక్షి) మండల కేంద్రంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన ఆకుల వీరాస్వామి,మియపురం పరిపూర్ణ చారి  కుటుంబాలను గురువారం భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట జిల్లా,మండల నాయకులు ముకిరాల మధువంశీ కృష్ణ,ఎంపీటీసీ దబ్బెట అనిల్,చిలుకల రాయకోమూరు,దొడ్డి కిష్టయ్య,బుర్ర శ్రీనివాస్,గుమ్మడి సత్యనారాయణ,సాంబయ్య,మొగిలి, సదయ్య తదితరులు ఉన్నారు.