మెడికల్‌ షాపుల బంద్‌తో నిరసన

విజయనగరం,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ):  అన్‌లైన్‌ ఔషధ విక్రయాలకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని నిరసిస్తూ విజయనగరంలో డ్రగిస్టులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న మెడికల్‌ షాపుల బంద్‌లో భాగంగా శుక్రవారం విజయనగరం కోట వద్ద నుండి కలెక్టర్‌ కార్యాలయం డ్రగ్‌ కంట్రోల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విజయనగరం కలెక్టర్‌ కార్యాలయం ముందు మెడికల్‌ షాప్‌ యజమానులంతా మానవహారం చేపట్టారు. ఈ ఫార్మసీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. జిల్లాలోని అన్ని మెడికల్‌ షాపులను మూసేశారు. ఆన్లైన్‌ విక్రయాలు వల్ల కెమిస్ట్‌లు, సిబ్బంది జీవితాలు నాశనం అవుతాయని, రోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. జిల్లాలో 3 కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు శేషగిరి, కార్యదర్శి శర్మలు డ్రగ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ కి సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనాలోచితంగా ఉందన్నారు. ప్రజలకు ఆన్లైన్‌ మందులు వల్ల ఒక్కసారి మందులు మారిపోయే ప్రమాదం
ఉందని తెలిపారు. దీనివల్ల ప్రాణాలకి కూడా ముప్పు రావచ్చని చెప్పారు. ప్రజలకు హ్యూమన్‌ రిలేషన్‌ దెబ్బ తింటుందని తెలిపారు. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

తాజావార్తలు