మెదక్ చేరుకున్న చంద్రబాబు మీ కోసం పాదయాత్ర
సంగారెడ్డి, నవంబర్ 18 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన మీ కోసం వస్తున్న పాదయాత్ర 44వ రోజు ఆదివారం మధ్యాహ్నం మెదక్ జిల్లాలో ప్రవేశించింది. రంగారెడ్డి జిల్లాలో ముగించుకొని మెదక్ జిల్లా పటాన్‌చెర్వు మండలం బీడిఎల్ గేటు వద్దకు చేరుకుంది. చంద్రబాబు పాదయాత్రలో ఆయన భార్య భువనేశ్వరీ, కుమారుడు లోకేశ్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు మైనంపల్లి హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి, కార్పొరేటర్ సావన్‌దేవ్, మాజీ మంత్రి బాబుమోహన్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.