మెదక్ జిల్లాలో లారీని ఢీకొన్న రైలు
మెదక్ : జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం సంఖాపూర్ రైల్వే గేటు వద్ద ప్రమాదం జరిగింది ఇండోర్-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును లారీ ఢీ కొంది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గేట్ వద్ద కాపల లేకపోవడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో మూడు గంటలకు పైగా ఈ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి, రామాయంపేట మండలం అక్కన్నపల్లి వద్ద పుష్‌పుల్ రైలు, చేగుంట వద్ద మరో రైలును అధికారు నిలిపివేశారు. ట్రాక్‌పై లారీని తొలగించే చర్యలను చేపట్టారు.