మెదక్ పర్యటనలో బాబుకు తెలంగాణ సెగ
మెదక్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో చేస్తున్న పాదయాత్రలో తెలంగాణ సెగ తగిలింది. సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్‌లో బాబు చేస్తున్న పాదయాత్రను తెలంగాణ మహిళలు ‘ జైతెలంగాణ’ నినాదాలతో అడ్డుకున్నారు. తెలంగాణపై బాబు స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.