మెదక్ జిల్లా ఎస్టి సర్పంచుల పోరం అధ్యక్షులుగా కోల బిక్షపతి..

గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కి …
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి కృతజ్ఞతలు…
జిల్లా గిరిజన సర్పంచుల పోరం అధ్యక్షులు కోల బిక్షపతి..

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మెదక్ జిల్లా ఎస్టి సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా కోల బిక్షపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో చిలప్ చేడ్ మండలంలోని సామల తాండ సర్పంచ్ కోల బిక్షపతిని గిరిజన జిల్లా సర్పంచ్ ల పోరం అధ్యక్షులుగా ఎంపిక చేసి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కోల బిక్షపతి మాట్లాడుతూ నాకు మెదక్ జిల్లా ఎస్టి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాధ్యతలు ఇచ్చినందుకు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా ఎస్టి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు కోల బిక్షపతికి ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, సోమక్కపేట్ సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్ రాoచంద్ర రెడ్డి, సోమక్కపేట్ సర్పంచ్ బెస్త స్రవంతి లక్ష్మణ్, రాందాస్ గూడ సర్పంచ్ యాదగిరి, చిట్కుల్ సర్పంచ్ గోపాల్ రెడ్డి, బిక్షపతికి శాలువాలతో సన్మానం చేశారు.