మేదరి సంఘం జిల్లా అధ్యక్షురాలిగా కోన ఆండాలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):మేదరి సంఘం సూర్యాపేట జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలిగా సూర్యాపేటకు చెందిన కోన ఆండాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక లక్ష్మీ గార్డెన్ లో జరిగిన జిల్లా మేదరి సంఘం సమావేశంలో ఆ సంఘ జిల్లా అధ్యక్షులు సులువ యాదగిరి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.ఆమెతో పాటుగా జిల్లా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా నోముల రాధ, కోశాధికారిగా కోన పుష్ప, ప్రచార కార్యదర్శులుగా సులువ నాగలక్ష్మి , కోన మమత తోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కొత్తగా నియామకమైన నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ నియామకానికి  సహకరించిన జిల్లా అధ్యక్షులు సులువ యాదగిరి , ప్రధాన కార్యదర్శి కోన మల్లయ్య ,
కోశాధికారి కల్లూరి తిరుపతయ్య , ప్రచార కార్యదర్శి షేర్ల వెంకన్న లకు కృతజ్ఞతలు తెలిపారు.మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తూ వారి అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు నోముల రుక్మిణి, గౌరవ అధ్యక్షురాలు కల్లూరి శోభారాణి, కోన లక్ష్మమ్మ కల్లూరి సైదమ్మ , యాదలక్ష్మి పాతవి లత, కల్లూరి సైదమ్మ , సులువ భవాని తదితరులు పాల్గొన్నారు.