మే 31న డైట్‌ సెట్‌ పరీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ ‘డీఎడ్‌ 2013’ నోటిఫికేషన్‌ జారీ అయింది. 2013-15 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు మే 31న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు డైట్‌ సెట్‌ కమిటీ చైర్మన్‌ వీ ఉషారాణి తెలిపారు. ప్రవేశ రాత పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం  12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 12 నుంచి 25 వ తేది వరకు ఆన్‌లైన్‌, ఈ సేవా కేంద్రాల వద్ద విద్యార్థులు రూ. 200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని,26 వరకు దరఖాస్తు ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.అన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చేప్పారు. దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇంటర్‌లో 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 డైట్‌ కాలేజీల్లో సుమారు 34 వేల సీట్లు ఉన్నట్లు డైట్‌ సెట్‌ 2013 కన్వీనర్‌ సీహెచ్‌ రమణకుమార్‌ చెప్పారు.