మైదానం వివాదాల్లో అంపైర్లు జోక్యం చేసుకోవద్దు: రోహిత్ శర్మ
ముంబై: ఐపీఎల్ మ్యాచుల్లో మైదానంలో జరిగే వివాదాల్లో ఆటగాళ్లు హద్దులు దాటేంత వరకు అంపైర్లు కలుగజేసుకోవద్దని, ఆటగాళ్లు మైదానంలో తమ ఆవేదనను వ్యక్తం చేసే అవకాశం ఇవ్వాలని ముంబై ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మ ఆదివారం అన్నాడు. ఐపీఎల్లో 26 మంది మ్యాచ్ అధికారులు, అన్ని జట్ల కెప్టెన్ల మధ్య జరుగుతున్న రెండు రోజుల సమావేశంలో భాగంగా తొలిరోజు రోహిత్ పైవిధంగా మాట్లాడాడు. మైదానంలో వివాదాల విషయంలో ఆటగాళ్లు తమ వాదన వినిపించాలనే ఉద్దేశ్యంతో ఈ సమావేశానికి తొలిసారి కెప్టెన్లను బీసీసీఐ ఆహ్వానించింది. మైదానం వివాదాల్లో అంపైర్లు జోక్యం చేసుకోవద్దు: రోహిత్ శర్మ రెండు జట్ల ఆటగాళ్లు హద్దులు దాటనంత వరకు అంపైర్లు కలుగజేసుకోవద్దని కోరారు. ప్రపంచ కప్‌తో తిరిగి రాకపోవడం నిరాశను కలిగించిందన్నాడు. ఐతే ఐపీఎల్ రూపంలో తమకు కొత్త సవాల్ ఎదురైందన్నాడు. ఐపీఎల్ ట్రోఫీ సాధించడమే తమ లక్ష్యమన్నాడు. ఈ టోర్నీలో ఆడటానికి సిద్ధంగా ఉన్నామని, వేలంలో ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లను వెతికి పట్టుకున్నామన్నాడు. ముంబై ఇండియన్స్ సమతూకంతో ఉందని, తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడటం సవాలే అన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్లో కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ పైనా రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాంటింగ్ అనుభవం తమకెంతగానో కలిసొస్తుందన్నాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీల్లో ఎలా ఆడాలో రికీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నాడు.