మైనంపల్లికి మంత్రి పదవి రాక ఫ్రస్టేషన్‌

బండితో పెట్టుకుంటే మసి కావడమే అన్న రాకేశ్‌
హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పెట్టుకున్నోళ్లు మట్టికరుస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..మంత్రి పదవి రానందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఫ్రస్టేషన్‌లో ఉన్నారన్నారు. మైనంపల్లి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు తమ వైఖరీని తెలపాలని డిమాండ్‌ చేశారు. బండి
సంజయ్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే బీజేపీ కార్యకర్తల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. బీజేపీ తలుచుకుంటే మైనంపల్లి బోయినపల్లి కూడా దాటలేడని ఎద్దేవా చేశారు. బీసీ వర్గాలకు చెందిన బండి సంజయ్‌పై దొర అహంకారంతో మైనంపల్లి మాట్లాడుతున్నారన్నారు. దళితబంధు అంటూనే దళితుల పట్ల టీఆర్‌ఎస్‌ శత్రువులుగా వ్యవహరిస్తోందన్నారు. మైనంపల్లి వర్గీయులు దళిత మహిళలపై దాడి చేయటమే ఇందుకు నిదర్శనంమని చెప్పారు. మైనంపల్లి బీజేపీలో చేరాలని ప్రయత్నించిన మాట వాస్తవమన్నారు. పోలీస్‌ స్టేషన్‌ నోటీస్‌ బోర్డులో ఫొటో ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ విూద కూడా మైనంపల్లి ఇదే బాషను ఉపయోగించారన్నారు. 36గంటల్లో మూడు పార్టీలు మారిన వ్యక్తులకు బండి సంజయ్‌ను విమర్శించే హక్కు లేదని రాకేష్‌రెడ్డి అన్నారు.