మైనారిటీ యువతకు సివిల్స్ లో ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోండి.
కొత్తగూడెం జనం సాక్షి ప్రతినిధి : 2022-2023 సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత శిక్షణ పొందేందుకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి, కుటంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను www.tmreis.telangana.gov.in నందు ఈ నెల22 వ తేదీ నుండి సెప్టెంబరు ఒకటవ తేదీ లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ ఉచిత శిక్షణ పొందేందుకు గాను, జిల్లా కేంద్రంలోని సెప్టెంబర్ 11న మైనార్టీ గురుకుల పాఠశాలలో స్క్రినింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ఈ టెస్టులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు హైదరాబాద్ లో ఒక ఏడాది పాటు ఉచిత శిక్షణ తో పాటు వసతి,భోజన సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.ఇరు జిల్లాలో మైనారిటీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సమాచారం కోసం 8520860785 గల నెంబర్ ను సంప్రదించాలన్నారు.