మైలారం పాఠశాల వద్ద పొంచి ఉన్న ప్రమాదం
ఆళ్లపల్లి ఆగస్టు23( జనం సాక్షి)
మండల కేంద్రంలోని మైలారం గ్రామ పాఠశాల, అంగన్వాడి కేంద్రం మధ్యలో ప్రమాదం పొంచి ఉంది. సుమారు 40 అడుగుల ఎత్తులో భారీ వృక్షం పూర్తిగా ఎండిపోవడంతో అది ఏ క్షణానైనా కూలిపోయే అవకాశం ఉంది. మైలారం పాఠశాలలో విద్యార్థులు 35 మంది ,అంగన్వాడి కేంద్రం 12 మంది విద్యార్థులు భయం భయంగా పాఠశాలకు రావాల్సి వస్తుంది. ఎలాంటి ప్రమాదం జరగకముందే అంగన్వాడి పాఠశాల మధ్యలో భారీ వృక్షం ఎండిపోవడంతో గాలి దుమారం భారీగా వస్తే కూలిపోయే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి ప్రమాదం జరగక ముందే సంబంధిత అధికారులు భారీ వృక్షాన్ని తొలగించాలి పలువురు అంటున్నారు.