మొగిలిచర్ల గ్రామంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు
కురవి సెప్టెంబర్-17 (జనం సాక్షి న్యూస్)
కురవి మండలం మొగిలిచర్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేసిన సందర్భంగా మొగలిచెర్ల గ్రామంలోని ప్రధాన కూడాలిలో రాజ్యాంగ రూపకల్ప డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన స్థానిక సర్పంచ్ నూకల అనిత వేణుగోపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ మల్లిడి గీత నరేష్. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ నూకల అనిత వేణుగోపాల్ రెడ్డి.అనంతరం మొగిలిచర్ల గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు బాణాల గోవర్ధన్ కు వీటివల్లే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ,ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ గా ఎర్రబోయిన శంకర్ అనేకమంది హృదయాలలో స్థిరస్తాయిగా నిలిచిన మంచి మనసున్న అవార్డుల పురస్కారం అందుకున్న సందర్భంగా గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వారిని శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లెడి గీతనరేష్, వార్డు మెంబర్లు,ఆశ వర్కర్లు,స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.