మొహర్రం వేడుకల్లో దేశభక్తి భావం.
బూర్గంపహాడ్ ఆగస్టు09(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో, మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన మొహరం వేడుకల్లో దేశభక్తి భావం వెల్లివిరిసింది. మొహరం వేడుకల్లో భాగంగా పీరీలను ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏడాది పీరీలను అందమైన వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ సారి మువ్వన్నెల జెండాను పోలి ఉండేలా మూడు రంగులతో పీరీని అలంకరించారు. ఈ పీరీలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించి గొమ్మూరు వద్ద నున్న ఈద్గా వద్దకు ప్రదర్శనగా వెళ్లారు. ఈ యాత్రలో మూడు రంగుల పీరీ ప్రత్యేక ఆకర్షగా నిలిచింది. స్థానికులు దీన్ని ఆసక్తిగా తిలకించారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని పీరీలను మువ్వన్నెల జెండా మాదిరిగా అలంకరించామని ముస్లీం మతపెద్దలు తెలిపారు. కార్యక్రమంలో షేక్ ఇమాం పాషా, యాకూబ్, అబ్బాస్, పాషా, వహీద్ తదితరులు పాల్గొన్నారు.