మోడీ ఎత్తుల ముందు చిత్తయిన విపక్షాలు

నితీశ్‌ను మరింత దగ్గర చేసుకున్న ప్రధాని

హరివంశ్‌ను నిలబెట్టడంలో రాజకీయ వ్యూహం

అలాంటి ప్రయత్నం చేయని కాంగ్రెస్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఎత్తులు పై ఎత్తులు వేయకపోతే రాజకీయం రంజుగా ఉండదు. చదరంగంలో ఎత్తులు ఎలా వేయాలో రాజకీయాల్లో అలాగే వేయాలి. ఇప్పడు మోడీ ఎత్తులకు విపక్షాలు చిత్తయ్యాయి.రాజ్యసభ ఉపాధ్యక్ష పదవిని సాధించడంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మోడీ వ్యూహం పన్నారు. ఒకటి ఎన్‌డిఎ అభ్యర్థిని గెలిపించుకోవడం అయితే..రెండోది నితీశ్‌ కుమార్‌ జారిపోకుండా చూసుకోవడం అన్న లక్ష్యాలను సాధించారు. నితీశ్‌ మళ్లీ యూపిఎ కూటమికి వెళతారన్న ఊహాగానాల మధ్య ఆ పార్టీకి చెందిన అభ్యర్థిని రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా చేయడం రాజకీయ చతురత కాక మరోటి కాదు. విపక్షాల ఐక్యత కోరుకుంటున్న కాంగ్రెస్‌ ఇలాంటి చాతుర్యాన్ని ప్రదర్శించలేక పోయింది. తమ పార్టీ అభ్యర్థిని కాకుండా ఏ విపక్ష అభ్యర్థినో నిలబెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నిజానికి టిడిపి అభ్యర్థినే రాజ్యసభ అభ్యర్థిగానో లేక తృణమూల్‌ లేదా డిఎంకె అభ్యర్థినో నిలబెట్టి ఉంటే కాంగ్రెస్‌ కూటమి మరింత బలంగా ఉండేది. పోటీ కూడా గట్టిగా ఉండేది. రాజకీయాల్లో ఇలాంటి ఎత్తులు వేయడంలో కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న రాహుల్‌ విఫలమయ్యారు. తననాయకత్వంలో కాంగ్రెస్‌ కూటమి ఏర్పడాలని కోరుకుంటున్న రాహుల్‌ ఇప్పటికైనా ఆలచనలకు పదను పెట్టాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ పార్టీలకు కాగ్రెస్‌ పార్టీనే ప్రధాన ప్రత్యర్ధిగా ఉంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ ముందున్న అసలు సమస్య. తమ రాష్టాల్రలో తమకు నష్టం జరిగే ఏ నిర్ణయాన్నీ ప్రాంతీయ పార్టీలు తీసుకోజాలవు. ఈ విషయంలో కాంగ్రెస్సే కొంత పట్టువిడుపులు ప్రదర్శించాల్సిన అవసరముంది. కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటే రాష్ట్రాల స్థాయిలో ఆయా ప్రాంతీయ పార్టీల అధిపత్యానికి భంగం కలుగకుండా తాను

కొంత వెనక్కి తగ్గక తప్పదు. ఇందుకు కాంగ్రెస్‌ సిద్ధపడితే తప్ప తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడం సాధ్యం కాదు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్రాలలో నెలకొన్న వాస్తవ పరిస్ధితులను సరిగా అర్ధం చేసుకుని ఆమేరకు నిర్ణయాలు తీసుకోకపోతే మొదటికే మోసం రావడం ఖాయం. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకన్నా హానంగా ఉంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా కొన్ని ప్రాంతీయ పార్టీల నుంచి సరైన సహకారం సాధించలేకపోయింది. సహకరించిన పార్టీల మద్దతను సరిగా వినియోగించుకోలేకపోయింది. కొన్ని పార్టీలు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి ఓటింగ్‌కు గైరుహాజరయ్యాయి. రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థి ఓడించాలని అనుకున్నా అందుకు తగిన వ్యూహాలు పన్నలేదు. ఎన్‌డిఎ కూటమిలో భాగమైనప్పటికీ ఈ ఓటింగ్‌కు దూరంగా వుంటామని శివసేన బహిరంగంగా ప్రకటించగా శిరోమణి అకాలీదళ్‌ లీకులిచ్చింది. కానీ రెండు మూడు రోజులు గడిచేసరికి వైఖరి మార్చుకొని ఆ పార్టీల ఎంపీలందరూ కూటమి అభ్యర్థికే ఓట్లు వేశారు. /ూజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో బిజెపి బలపరిచే అభ్యర్థికి ఓటు వెయ్యబోమని మాత్రమే మొదట్లో చెప్పిన వైసిపి ఎంపి ఆ తరువాత ప్రతిపక్షాల అభ్యర్థికి ఓటు వేస్తామని ప్రకటించారు. ఓటింగ్‌ జరిగే సమయానికి ఆ పార్టీ ఎంపి గైరుహాజరు అయ్యారు. ప్రతిపక్షాల తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీ చేస్తారని విూడియాకు ప్రకటించారు. ఆ సాయంత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. కాని రాష్ట్రానికి కాంగ్రెస్‌ కూడా అన్యాయం చేసింది కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయబోమని వైకాపా ప్రకటించింది. అంటే కాంగ్రెస్‌ తన అభ్యర్థిని కాకుండా ఇతర అభ్యర్తిని నిలబెడితే మరోలా ఫలితం ఉండేది.టిఆర్‌ఎస్‌ మొదట గుంభనంగా వ్యవహరించినా ఓటింగ్‌కొచ్చేసరికి అధికార కూటమి అభ్యర్థికే మద్దతునిచ్చింది. రాష్ట్రంలో అధికారం కెసిఆర్‌కు, ఢిల్లీ పీఠం మోడీకి ముఖ్యం. అందుకే ఎవరి రాజకీయాలకు అనుగుణంగా వారు నడుస్తున్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు గానీ, ఎవిరిని తప్పుబట్టడానికి కానీ లేదు. బిజెపి అధికారంలో ఉంది కనుక గతంలో కన్నా చురుకుగా వ్యవహరిస్తోంది.