మోడీ పాలనలో ప్రభుత్వ రంగాన్ని దివాలా తీస్తున్నారు
103 ఏళ్ల చరిత్ర గల కార్మిక సంఘము ఏఐటీయూసీ
–సిపిఐ జిల్లాసమితి సబ్యులు గుగులొత్ రాంచందర్ నాయక్
— ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి నజీర్ అహ్మద్
టేకులపల్లి,అక్టోబర్ 31( జనంసాక్షి): భారత దేశం లో కార్మికుల హక్కుల కోసం 1920 అక్టోబర్ 31 న బొంబాయి కేంద్రం గా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు లాలలజపతి రాయ్ , నెహ్రు , దిమన్ చమన్ లాల్ ,ఎస్ఎ డాంగే ,ఇంద్రజిత్ గుప్తా తదితరుల నాయకత్వంగా ఏఐటీయూసీ ఆవిర్భావం నుంచి అనేక ఉద్యమాల నిర్వహించి అనేక చట్టాలు సాధించిన చరిత్ర ఏఐటీయూసీ ది అని సిపిఐ జిల్లా సమితి సబ్యులు గుగులొత్ రాంచందర్ అన్నారు. టేకులపల్లి మండలం లో జరిగిన ఏఐటీయూసీ 103వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగినాయి. స్థానిక మండల కార్యాలయంలో రాంచందర్ పతాకాన్ని ఆవీష్కరించారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునీయన్ ఆద్వర్యంలో కొయగుడెం ఓసిపి నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత యునీయన్ పతాకాన్ని ఈపి ఫిట్టర్ లక్షమ్మయ్య ఆవీష్కరించారు. ఈ
కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి యండి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చాక దేశ ప్రజల సొమ్ము తో నెలకొల్పిన అనేక పరిశ్రమలు సంస్థలు రైల్వ్ ,బ్యాంక్స్ ,ఇన్సూరెన్క్ ,టెలికాం ,విద్యుత్ , చమురు , స్టీల్ , విమాన రంగం , రక్షణ , ఇలా అనేక రంగాలను బిజెపి మోడీ పాలనలో కారుచవకగా ప్రెవేట్ పెట్టుబడిదారులు అంబానీ , అదానీలకు కట్టబెట్టుతున్నారని దేశంను నాశనం చేస్తున్నారని వారు విమర్శించారు. కార్మిక చట్టాలు మొత్తం మార్పు చేస్తున్నరని, కార్మికుల హక్కుల పరిరక్షణ లేకుండా మోడీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర కార్మిక చట్టం తేవాలని సుప్రీంకోర్టు ఆదేశానుసారం కనీసవేతనం , సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల