మోడీ మాటలు నీళ్ళ మీద రాతలు ఒక్కటే

నంగునూరు,జూన్27(జనంసాక్షి):
మోడి మాటలు నీళ్ల మీద రాతలు ఒక్కటేనని
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
దేవులపల్లి యాదగిరి అన్నారు.
దయ్యాలు వేదాలు జెప్పినట్టు
ఎమర్జెన్సీపై మోడీ సుద్దులున్నాయని ఆయన ఆరోపించారు.సోమవారం నంగునూరు లో విలేకర్లతో మాట్లాడారు.ఒక వైపు దేశంలో పౌర ప్రజాతంత్ర విలువలపై హక్కులపై , క్రూరంగా దాడులు చేస్తూ , మరో వైపు 1975 జూన్ 26 ఎమర్జెన్సీ గురించి ప్రధాని మోడీ విదేశీ గడ్డపై సుద్దులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రపై నల్ల మచ్చన్న మోడీ మాటలు గురువిందను తలపించాయన్నారు.ఆదివారం మ్యూనిచ్లో ప్రవాస భారతీయుల నుద్దేశించి మాట్లాడిన మాటలు దేశ ప్రగతికి పనికొచ్చేటియే నా అని నిలదీశారు.47 ఏళ్ల క్రితం సంఘటనను గుర్తు చేసి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం మూర్ఖత్వమే అన్నారు.
భారతీయుడిలో అణువణువునా ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్న మోడీకి దేశ భక్తుడిలా మాట్లాడితే మోడీలో వున్నా రాక్షసుణ్ణి ప్రజలు మరిచిపోరని తెలియజేశారు.ప్రస్తుతం భారత దేశంలో భారత ప్రజాస్వామ్య పైన అమలు జరుగుతున్న అనధికారిక ఎమర్జెన్సీ
గురించి సమాధానం చెప్పే ధముందా అని ప్రశ్నించారు.ఏడు సంపన్న దేశాల కూటమి సదస్సుకు వెళ్లిన ప్రధాని మోదీ ఆహార భద్రత, ఉగ్రవాద వ్యతిరేకత, పర్యావరణం , ప్రజాస్వామ్యం వంటి అంశాలపై
మాట్లాడకుండా కాంగ్రెస్ పైన గాంధీ కుటుంభం పైన పనికిరాని మాటలు మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ధనిక దేశాల కూటమి , దాని భాగస్వామ్య దేశాల నేతలతో మాట్లాడే మోడీ జి భారత దేశాన్ని ఆర్దికంగా దివాళా తీయించి
నేపాల్ దేశంకన్నా వెనక్కి నెట్టిన సంగతి మర్చిపోరాదని ఎద్దేవా చేశారు.మండల కాంగ్రెస్ నాయకుడు జంగిటి శ్రీనివాస్, దేవులపల్లి శ్రీను,ప్రసాద్, శంకర్,పాల్గొన్నారు.