*మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలి* అగ్నిపథ్ పతాకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి

 నిర్మల్ బ్యురో, జూన్ 18,జనంసాక్షి,,,  ప్రధాని మోదీ నేతృత్వంలోని  బీజీపీ ప్రభుత్వం   అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, అన్ని రంగాల్లోను దేశాన్ని అథోగతి పాలుచేసిందని  అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ మండలం న్యూ పోచంపహడ్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… అగ్నిపత్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువకులు కధం తొక్కారని, ఇది మరింత పెద్దదిగా కాకముందే మోదీ మెలుకుంటే మంచిదని హితవు పలికారు.  ప్రధాని మోదీ ఇకనైనా  ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ఉంటే ఇలాంటి ప్రజలు చూస్తూ ఊరుకోరనడానికి రైతు ఉద్యమాలు, ఇలా అగ్నిపత్ పథక వ్యతిరేఖ  పోరాటాలే నిదర్శనమన్నారు.  అయితే హింసకు తావు లేకుండా శాంతియుత పద్దతుల్లో నిరసనలు తెలియజేయాలని మంత్రి  కోరారు.
ఓవైపున రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం  తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు ఉద్యోగాల నియామకాలు చేస్తుంటే….  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశభద్రతను పణంగా పెట్టి అగ్ని పత్ లాంటి పథకం తెచ్చి… దొడ్డిదారిన నియామకాలు చేసేందుకు ప్రయాణం చేస్తుందని మండిపడ్డారు.
సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టిఆర్ఎస్ ఉందన్న బిజెపి పెద్దలు, మరి  బీహార్, హర్యానా, యుపిలో జరిగిన అల్లర్ల వెనుక కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నాయంటారా?, మరి ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బిజెపినే అక్కడి ఆలర్లకు కారణమా? అని   ప్రశ్నించారు.