మోహన్‌రెడ్డినే బలపరచండి
ఆదిలాబాద్, డిసెంబర్ 7 : టీఆర్‌టీయూ ఏ పార్టీకి అనుబంధం కాదని ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలపై పోరాడే ఉపాధ్యాయ సంఘమని ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోహన్‌రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కాదని వారు స్పష్టం చేశారు. కావాలని కొంత మంది మోహనరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని వారు అన్నారు. ఉపాధ్యాయుల ప్రతనిధిగా వారి సమస్యలను పరిష్కరించడానికి అధికార పార్టీలతో, రాజకీయాలతో సంబంధాలు కాపాడుకోవడం అవసరమన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరాడే మోహన్‌రెడ్డికి మద్దతు ఇచ్చి ఆయనకు ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.