మ్యాజిక్‌ నెంబర్‌ 110

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎస్పీ, బీఎస్పీల వాకౌట్‌తో ఎఫ్‌డీఐలపై గట్టేక్కిన యూపీఏ సర్కారుకు రాజ్యసభలో అసలు సినలు పరీక్ష ఎదురుకనుంది. ఈ సభలో ఎఫ్‌డీఐలపై తీర్మానాన్ని అన్నాడీఎంకేకు చెందిన మైత్రేయన్‌ ప్రవేశపెట్టారు. ఈ సభలో మొత్తం 244 మంది సభ్యులున్నారు. అయితే యూపీఏకు 102, ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్న ఎన్డీయే, వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఏడీంకే, బిజూజనతాదళ్‌లకు 99 మంది సభ్యుల బలముంది. అయితే కొన్ని పక్షాలకు చెందిన సభ్యులు ఓటింగ్‌లో గైర్హాజర్‌ అయ్యే అవకాశముంది దీంతో కనీసం 110 మంది సభ్యుల మద్దతు అవసరముంది. అయితే యూపీఏ దానికి మద్దతిస్తున్న ఇతర పక్షాలతో కలిసి 102 కంటే బలం మించడంలేదు. బీఎస్సీకి 15, ఎస్పీకి 9 మంది సభ్యుల బలముంది బీఎస్పీ యూపీఏను అదుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ సభలో పెట్టిన తీర్మానం వీగిపోయే అవకాశముంది.