యజమాని చలపతిరావు దుర్బుద్ధితో కౌలురైతుకు మోసం.

న్యాయం చేయాలంటూ పోలీసులకు పిర్యాదు.
కోడేరు (జనం సాక్షి) జూలై 20 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రము లో  కౌలు రైతు యం డి ఖాశీం  ప్రభుత్వం నుండి ఏ పెట్టుబడి సాయం లేకుండా ప్రైవేట్ అప్పులు చేసి పంట పండిస్తే కొనుగోలు అధికారులతో భూ యజమని కుమ్మక్కై పంట సొమ్మంతా తన ఖాతాలో జమచేసుకున్న వైనం కోడేర్ మండల కేంద్రంలో జరిగింది.
2 సంవత్సరాల కాలం కౌలుకు తనకే ఒప్పందం ఉన్నప్పటికీ వ్యవసాయం చేయకుండా యజమాని చలపతిరావు తనకు అనుకూలమైన వ్యక్తులతో మాపై దాడి చేయించుటకు సిద్ధమయ్యాడని కౌలురైతు యండి, ఖాసీం ఆవేదన వ్యక్తం చేశాడు.
దాదాపు పంట సొమ్ము రూ,,4లక్షలకు పైగా జమైనప్పటికి ఇంకా రూ,, 1లాక్షా29వేల రూపాయలు తనకు ఇవ్వాల్సి ఉన్నదని ఆయన తెలిపారు.
తనకు రావాల్సిన డబ్బు బంధువుతో పంపానని అతనితో డబ్బులు తీసుకోవాల్సిందిగా భూ యజమాని సూచించడంతో ఆ డబ్బులకోసం నాగర్ కర్నూలుకు వెళ్లగా అతను తనకు డబ్బులు ఇవ్వడంకోసం కోడేర్ కు వచ్చినట్లుగా ఫోన్ ద్వారా తెలిపాడు. నేను కోడేర్ కు వచ్చేవరకు ఆలస్యం అవుతుందని అతను బంధువైన మరో వ్యక్తికి డబ్బులిస్తున్నానని వచ్చి తీసుకోవాల్సిందిగా సూచించాడు. డబ్బులివ్వాల్సిన వ్యక్తి ఇప్పుడు అప్పుడూ, పొద్దునా, సాయంత్రమంటూ  ఇంటి చుట్టూ తిప్పుకుని ఇంటికి ఎందుకు తిరుగుతున్నావు నీ డబ్బులు నీకు ఇచ్చేసానుగదా ఎందుకోస్తున్నావని ఎదురు దాడికి దిగుతున్నాడు.
డబ్బులివ్వకుండా నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చలపతిరావును నా డబ్బులు నాకు ఇప్పించమని లేదా నీవైనా ఇవ్వాలని వత్తిడి తేవడంతో అందరం కలిసి మాట్లాడదామని నిర్ణయించడం జరిగింది. చలపతిరావును డబ్బులివ్వాల్సిన వ్యక్తిని కలిపి మాట్లాడినా ప్రయోజనం లేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ యజమానికి దుర్భుద్ధి లేనట్లయితే మా పంట సొమ్ము మాకు ఇవ్వకుండా మమ్మల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసి, అధికారులపై వత్తిడి తెచ్చి తన ఖాతాలో ఎందుకు జమ చేసుకున్నాడో విచారించాలన్నారు.
భూ యజమాని నుండి తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి ఈ సంవత్సరం కౌలుకు తనకే వప్పందం ఉన్నందున తన అనుచరుల నుండి తమ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా న్యాయం చేయాల్సిందిగా కోరుతూ పోలీసులకు పిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు.   (రైతు ఖాసీం ఫోటో) (యజమాని కి రైతుకు కుదుర్చుకున్న ఒప్పందం పత్రం)