యథావిధిగా అంతర్గత పరీక్షలు

గడువు పొడిగించే యోచన !
గణేశ్‌నగర్‌, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ విద్యార్థులకు ముందుగ నిర్ణయించిన ప్రకారమే జరిగే అవకాశం ఉంది. ఈనెల 18 నుంచి 31 వరకు అంతర్గత పరీక్షలు నిర్వహించాలని వర్సిటీ అధికారులు ఆదేశించారు. అయితే ఫిబ్రవరి ద్వితీయ పక్షంలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ, ప్రయివేటు
కళాశాలల యాజమాన్యాలు కోరాయి. అయితే ఉపకులపతితో సమావేశమై నిర్ణయం ప్రకటిస్తామని రిజిస్ట్రార్‌ ఆచార్య బి.భద్రయ్య తెలిపారు. ముందుగా నిర్ణయించినట్లు అంతర్గత పరీక్షలను ప్రారంభించాలని.. అయితే ఈనెల 31 లోగా కాకుండా ఫిబ్రవరి మొదటి వారం వరకు ఆయా కళాశాలల వెసులుబాటు ప్రకారం నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా గురువారం ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు.