యధావిధిగా కందులు కొనుగోళ్లు

 

అనంతపురం,జనవరి17(జ‌నంసాక్షి): జిల్లాలో కందుల కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు మార్క్‌ఫెడ్‌ జిల్లా అధికారులు అన్నారు. ఆధార్‌నంబరు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకుఖాతా నంబరు, మండల వ్యవసాయాధికారితో సాగు ధ్రువీకరణ పత్రం వంటివి కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. కందులను కొనుగోలు చేసిన వారం, 10 రోజుల వ్యవధిలో ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఇంకా కందులను అమ్మాలనుకునే రైతులు సవిూప మండల కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు. కందులను శుభ్రం చేసి తెస్తే సరిపోతుందనీ.. లేకపోతే కొనుగోలు కేంద్రాల్లోనే జల్లెడ వేస్తామన్నారు. జిల్లాలో మార్క్‌ఫెడ్‌ సహకారంతో ఎఫ్‌సీఐ ద్వారా కందులను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. మద్దతు ధర మేరకు చొప్పున కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కందులను కొనుగోలు కేంద్రాలకు తెచ్చే రైతులు తేమ 12 శాతం, వ్యర్థపదార్థాలు 2 శాతం, పురుగుపట్టిన గింజలు 3 శాతం, పాక్షికంగా, దెబ్బతిన్న గింజలు 3 శాతం విధిగా ఉండాలని డీఎం తెలిపారు.