యావత్ తెలంగాణ సమాజానికి మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
బజార్ హత్నూర్ మండల కన్వీనర్ రాజారామ్
బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మోదీ మాట్లాడారని బజార్ హత్నూర్ మండల కన్వీనర్ కానిందే రాజారామ్ అన్నారు యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బజార్ హత్నూర్ మండల కన్వీనర్ రాజారామ్ డిమాండ్ చేశారు నేటికీ విభజన హామీలు ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు స్వయంగా కెసిఆర్ గారు అన్ని సార్లు వచ్చిన మొహం చాటేసిన మోదీ గారు వాటికి జవాబు చెప్పాలన్నారు సీఎం కెసిఆర్ గారి సారథ్యం లో సాధించుకున్న తెలంగాణ ను సాదించుకొనీ అభివృద్ధి చేసుకుంటూ పోతే మోదీ గారు ఓర్వలేక విషం చిమ్ముతున్నారు అమరుల త్యాగాలను బీజేపీ వారు హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు బజార్ హత్నూర్ మండల కేంద్రాల్లో అంబేత్కర్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించి ఈ సందర్భంగా మండల కన్వీనర్ మాట్లాడుతూ సమైక్యవాదుల సంకెళ్ళ కింద నలిగిపోయిన తెలంగాణ నేడు రాష్ట్రానిగా అవతరించి స్వంత శక్తితో ముందుకు సాగుతుంది తెలంగాణ వాస్తే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటారు వారి కళ్ళముందే ఏకంగా దేశానికి 60% పైగా ధాన్యాన్ని ఇస్తు దేశ ధాన్యాగారంగా తెలంగాణ తయారైంది అని అన్నదాతకు రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తూ బంగారు తెలంగాణ ఆవిష్కృతం చేసేందుకు వృధాగా సముద్రం పాలవుతున్న సీఎం కెసిఆర్ గారు గోదావరి నీటిని ఒడిసి పట్టి తెలంగాణను అగ్రగామిగా నిల్చోపెట్టరు తెలంగాణ దేశానికి ఒక దిక్సూచిగా నిలిచింది అని అన్నారు ఈ కార్యక్రమంలో
బోథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పులి శంకర్ గౌడ్,టీ ఆర్ స్ పార్టీ మండల ఉప అధ్యక్షుడు కొడరీ నరేష్,పార్టీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ సాయన్న,మండల యస్.సి.సెల్ అధ్యక్షుడు
ప్రభు,ఎస్టీ సెల్ అధ్యక్షుడు గెడం తులసిరాం బిసి సెల్ మండల అధ్యక్షుడు అంకుష్,మండల యూవజన సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్,నాయకులు పోతన్న, అల్లూరి నర్సారెడ్డి,ఉషన్న,చట్ల జగదీశ్,మోహన్,భీం రావ్,షబ్బీర్,తత్వెంధర్, ఆడేళ్ల,చట్ల ఉత్తం,అందే ప్రకాష్ భగత్ వినోద్ రమేష్,తదితరులు పాల్గొన్నారు