యాసంగి ధాన్యం డబ్బులు చెల్లించాలి.

తొర్రూర్ 25 జూన్ (జనంసాక్షి )యాసంగి వరి సాగు చేసిన రైతులకు వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి పూర్తిస్థాయిలో డబ్బులు రాలేదని వాటిని వెంటనే విడుదల చేయాలని సిపిఐ (ఎంఎల్) ప్రజా పందాతొర్రూరు డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ముందంపల్లి వీరన్న లు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో వారు మాట్లాడుతూ ధాన్యం అం కొనుగోలు చేసి  రెండు నెలలు గడిచినా నేటికీ ప్రభుత్వం ఆ డబ్బులు చెల్లించకపోవడం సరి కాదని అన్నారు.వర్షాకాలం సాగు చేస్తున్న రైతాంగానికి బ్యాంకులో అప్పులు ఇవ్వక,ధాన్యం బకాయిలు అందక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు పోయి అధిక వడ్డీకి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అప్పుల పాలైన రైతాంగం ఆ అప్పుల తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నహృదయవిదారకమైన ఘటనలు ఎన్నో జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.సొంత రాష్ట్రంలో రైతాంగానికి ధాన్యం బకాయిలు చెల్లించలేని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలలో రైతాంగo బాధల పట్ల మొసలి కన్నీరు కార్చడం విచిత్రంగా ఉందన్నారు. ధాన్యం తూకాలు జరిగి రెండు నెలలు గడిచిపోయినా ప్రభుత్వం రైతాంగానికి సకాలంలో లోడబ్బులు చెల్లించక పోవటానికి నిరసనగా ఆందోళన చేయకతప్పదని వారు  అన్నారు.అర్హత ఉన్న రైతాంగానికి రైతుబంధు ను వెంటనే ఇవ్వాలని, లక్షలాదిమంది కౌలు రైతులకు నేటికీ రైతు బంధు అందటం లేదని వారికి కూడా వెంటనే అందించాలని వారు డిమాండ్ చేశారు. వివిధ బ్యాంకులు రైతాంగానికి ఇచ్చిన రుణాలను వెంటనే మాఫీ చేసి  ఉచితంగా కొత్త  రుణాలు అందించాలని,ఉచిత విత్తనాలు పురుగు మందులు ఎరువులు అందించాలని అన్నారు.విత్తనాల డీలర్లు సిండికేట్గా ఏర్పడి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్ ఇలాంటి క్రిమినల్ కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో లో దావత్ దేవా,లింగాల మహేష్,రామ్మూర్తి,రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు