యుటిఎఫ్ నేత నాగటి నారాయణ మృతి విద్యా రంగానికి తీరని లోటు
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి): ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు నాగటి నారాయణ అకాల మరణం ఉపాధ్యాయ, విద్యా రంగానికి తీరని లోటని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.రాములు అన్నారు.బుధవారం ఆ సంఘ సూర్యాపేట డివిజన్ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య అధ్యక్షతన నాగటి నారాయణ
సంస్మరణ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సిహెచ్.రాములు మాట్లాడుతూ నాగటి నారాయణ ఉపాధ్యాయ ఉద్యమంలో మూడు దశాబ్దాలపాటు పనిచేసి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని అన్నారు.నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ఉన్నత విద్యను అభ్యసించి, ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఖమ్మం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శిగా పని చేసి అనంతరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా అనేక పోరాటాల్లో నాయకత్వం వహించి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు,విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం కృషిచేశారని అన్నారు.అప్రెంటిస్ రద్దు , నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరి కొరకు ఆయన చేసిన ఉద్యమం మర్చిపోలేనిదని తెలిపారు.స్పెషల్ విద్యా వాలంటీర్లను రెగ్యులర్ చేయించడంలో, ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి సాధనలో ముఖ్య భూమిక పోషించారని తెలిపారు.ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు ఎస్.అనిల్ కుమార్ , ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య , జిల్లా కార్యదర్శులు ఎస్ కె సయ్యద్ , యాకయ్య , వెంకన్న , పాపిరెడ్డి, రమేష్ , ఆడిట్ కమిటీ కన్వీనర్ బి.ఆడం , అకాడమిక్ కన్వీనర్ రమేష్ , వివోటిటి కన్వీనర్ లాలు , సోషల్ మీడియా కన్వీనర్ డి శ్రీనివాసచారి,వివిధ మండలాల బాధ్యులు ఆర్ శీను, సీనయ్య, ఆనంద్, రమేష్,గోవర్ధన్, శేఖర్, అంజయ్య , నరసయ్య, సైదా , చందు , ధనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.