యుద్ధ విమానాల ధరలను తగ్గించే యోచనలో కేంద్రం

– రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌వి అసత్యాలే
– కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ, ఆగస్టు29(జ‌నం సాక్షి) : 2007లో యుపిఎ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంతో పోల్చితే 2016 ఒప్పందం ప్రకారం ప్రతి యుద్ధ విమానం ధరను కనీసం 20 శాతం తగ్గించాలని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం గట్టిగా చర్చలు జరుపుతున్నదని అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రముఖ విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విమానం పూర్తి లోడ్‌తో రానుందని, ఈ ఒప్పందాన్ని ఎవరి ప్రమేయం లేకుండా రెండు ప్రభుత్వాలు మాత్రమే చేసుకున్నాయన్నారు. ఒక సాధారణ యుద్ధవిమానాన్ని, ఆయుధ యుద్ధవిమానంతో సరిపోల్చగరా? వారు 2012లో ఒప్పందంతో వస్తే, దాన్ని 2017లో పంపిణీ జరిగిందన్నారు. 2007 నుండి 2017 వరకు విదేశీ మారకపు వైవిధ్యంతో ఏర్పడిందని అన్నారు. 2007లో ఆఫర్‌ను తీసుకొని 2015-16తో పోలీస్తే నాటి ప్రాథమిక యుద్ధవిమాన ధరల కంటే లోడెడ్‌ యుద్ధవిమానాల ధరలు తొమ్మిది శాతం కన్నా ఖర్చు తక్కువగా ఉందని అన్నారు. రాఫెల్‌ను అధికమొత్తంలో కొనుగోలు చేసినట్లు రాహుల్‌గాంధీ ఆరోపించారని అన్నారు. కాంగ్రెస్‌ చెప్పే ప్రతి వాస్తవం వెనుక అవాస్తవం దాగి ఉందని అన్నారు. 2007 రాఫెల్‌కు సంబంధించిన ధరల విషయంలో కూడా రాహుల్‌ గాంధీ వేర్వేరుగా చెప్పారన్నారు.