యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేరళకు రూ. 700 కోట్ల ఆర్థిక సాయం
అబుదాబి(జనం సాక్షి):భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి రూ. 700 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ). కేరళకు రూ. 700 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్ సయద్ అల్ నహ్యన్… ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపినట్లు కేరళ సీఎం విజయన్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్ మీడియాతో మాట్లాడుతూ… కేరళ రాష్ర్టానికి అండగా నిలుస్తున్న ఆయా దేశాలు, రాష్ర్టాలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టామన్నారు విజయన్. వర్షాలు తగ్గడంతో ప్రజలు తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్నారు. పలు ఇండ్లలో బురద ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.