యువకుడి దారుణ హత్య
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి అన్నయ్యను ప్రియుడు అతిదారుణంగా హత్యచేసాడు. మెట్‌పల్లిలోని ఈ ఘటన చోటుచేసుకుంది. బీడి కాలనిలో నివాసముంటున్న ఇలియాస్ గతకొంతకాలంగా ఓయువతితో ప్రేమించుకుంటున్నారు. అయితే తరుచూ తమ ప్రేమకు అడ్డుపడుతున్నాడని ప్రియురాలి అన్నయ్య కయ్యింను హతమార్చాలనుకున్నాడు. కయ్యూంను పథకం ప్రకారం బయటకు తీసుకెళ్లి తలపై బండరాళ్లతో మోది అతి దారుణంగా హత్యచేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.