యువతకు స్వయం ఉపాధి అవకాశాలు: కేసీఆర్

మహబూబ్నగర్ : తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదివారం మహబూబ్నగర్లో పర్యటించారు. పాత పాలమూరు బస్తీవాసుల సమస్యలని అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ సమస్య రూపుమాపడానికి యవతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం చెప్పారు. బస్తీల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బస్తీ అభివృద్ధికి ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

బస్తీవాసుల సహకారంతోనే సత్వర అభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. బస్తీవాసులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అన్ని సమస్యలని ఒక్క రోజులోనే పరిష్కరించుకోలేమని, రోజుకో సమస్యని తెలంగాణలో పరిష్కరించుకుందామని కేసీఆర్ చెప్పారు.