యువతి దారుణ హత్య

తిర్యాని: మండలం గుండాల గ్రామపంచాయితీ పరిదిలోని యాజుగూడ గ్రామానికి చెందిన కోవ ప్రమీల (18) అదే గ్రామానికి చెందిన అరుక శ్రీను గురువారం రాత్రి తన పంటచేనులోకి తీసుకెళ్లి హత్యచేసినట్లు గ్రామస్థులు తెలిపారు. కోంతకాలంగా ప్రమీలను శ్రీను ప్రేమ పేరుతో వేదిస్తున్నట్లు వారు తెలియజేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు