*యువత దేశ భక్తిని పెంపొందించు కోవాలి ఎమ్మెల్యే బొల్లం*

కోదాడ జులై 30(జనం సాక్షి)
 శనివారం కోదాడ పట్టణం లోని టిటిడి కళ్యాణ మండపం లో సోషల్ యాక్టివిటీ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుల ఫొటో ప్రదర్శన ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత దేశ భక్తి పెంపొందించుకోవాలని అన్నారు.దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలన్నారు.వారి త్యాగాలే నేటి స్వేచ్చా  స్వాతంత్ర్యాలు అన్నారు. భవిష్యత్ తరాలు స్వతంత్ర సమరయోధుల చరిత్రలను తెలుసుకోవాలన్నారు. ఫోటో ప్రదర్శనతో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని  పెంపొందిస్తున్న సోషల్ యాక్టివిటీ ఫోరం నిర్వాహకులు అభినందనీయులు అన్నారు. భారతదేశంలో భిన్న మతాలు విన్న కులాలు  అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రాముఖ్యతను చాటుకుంటుందని తెలిపారు. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తి తీసుకొని విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి,  కోదాడ ఎంపీపీ చింత కవితా రాధారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, కోదాడ మండల పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్,కోట మధు,మైసా రమేష్,ఖదీరు,గుండెల సూర్యనారాయణ,లలిత,కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, బెజవాడ శ్రవణ్,,కాజా,ఒంటి పులి శ్రీనివాస్,చింతల్ నాగేశ్వరరావు,సాదిక్,బత్తులు ఉపేందర్, నిర్వాహకులు మునీర్, దొంత గాని శ్రీనివాస్, నరసయ్య, కొట్టే నాయక్, గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శాంత కుమారి,తదితరులు పాల్గొన్నారు.