యూఏఈపై విండీస్ ఘనవిజయం
ప్రపంచకప్‌లో వెస్టిండీస్ నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో విండీస్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జాన్సన్ చార్లెస్, కార్టర్ అర్ధసెంచరీలతో రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. యూఏఈ నిర్దేశించిన 176 పరుగుల టార్గెట్ ను విండీస్ 30.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. యూఏఈ బౌలర్లలో అమ్జాద్ జావెద్, గురుజి రెండేసి వికెట్లు పడగొట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. నాలుగు వికెట్లతో ఆదరగొట్టిన విండీస్ కెప్టెన్ హోల్డర్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ దక్కింది.