యూటిఎఫ్ ఆధ్వర్యంలో నేటినుంచి ఆందోళనలు
అమరావతి,సెప్టెంబర్26(జనంసాక్షి): ఉపాధ్యాయుల, పాఠశాలల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ, పి. బాబురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హావిూలు అమలు కాలేదని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, ఆన్‌లైన్ యాప్‌లు భారంగా మారడం వల్ల బోధన కుంటుపడుతోందని తెలిపారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్లకు వెంటనే జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. స్పెషల్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు, పండిట్, పీఈటీ అప్‌గ్రెడేషన్ సర్వీస్ రూల్స్ అమలు చేసి ప్రమోషన్లు ఇస్తా మని, అంతర్ జిల్లా బదిలీలు చేస్తామని ఫ్యాఎ/-టోకి హావిూలు ఇచ్చి నెల రోజులు గడిచినా అమలు కాలేదన్నారు.