యూపిలో తేలనున్న బలాబలాలు
యోగి ఆదిత్యనాథ్ పాలనపై నేడు తీర్పు
మోడీ ప్రభావంపైనా సర్వత్రా ఆసక్తి
ఎప్పీ,ప్రియాంకల సమ్మోహనానికి పరీక్ష
లక్నో,మార్చి9(జనం సాక్షి): యూపి ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా మారయి. గురువారం ఫలితాలు వెల్లడి కానుండడంతో మరోమారు ప్రస్తుత సిఎం యోగి మళ్లీ సిఎం అవుతారా అన్నది తేలనుంది. ఇకపోతే ప్రధానంగా మొన్నటి ఎన్నికలు బిజెపి, ఎస్పీల మధ్యనే నడిచాయని అంటున్నారు. అలాగే బిఎస్పీ పెద్దగా ప్రభావం చూపక పోవచ్చని అంటున్నారు. అంతేగగాకుండా మహిళలను, యువతను లక్ష్యంగా చేసుకుని
ప్రియాంక గాంధీ రాజకీయప్రయోగం చేశారు. ఆమె ఛరిష్మా ఏ మేరకు పనిచేస్తుందన్నడానికి ఈ ఫలితాలు పరీక్ష కాబోతున్నాయి. ఇకపోతే అధికారం దక్కించుకునేంతగా ఎస్పీ కూడా సాగడం లేదని తేలిపోయింది. ఇదే సందర్భంలో యోగి ఆదిత్యనాథ్, మోదీ విధానాలు, నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత బిజెపిని ఓడిరచేంత ప్రబలంగా మారలేదని అంటున్నారు. అయిష్టంగానే చాలామందది బిజెపికి ఓటు వేశారని
ప్రచారం జరిగింది. దీనికి కారణం అవినీతి రహిత పాలన ఓ కారణం అయితే , యోగగీ అద్భుత నాయకత్వం కూడా కారణమని చాలామంది భావించారు. 2012`17 మధ్య కాలంలో అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం యాదవులు` ముస్లింలు కేంద్రంగా పాలన జరిగిందని, అప్పటి దుష్పరిపాలన ఫలితాల ప్రభావం ఇతర వర్గాలపై ఇప్పటికీ ఉన్నదన్న ఆరోపణలు వచ్చాయి. అయితే కేవలం ఆదిత్యనాథ్‌కే వదిలేస్తే బిజెపి యూపీలో విజయం సాధించలేకపోవచ్చునని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా రంగంలోకి దిగి చివరి వరకూ జనం మధ్యలో ఉండడం, అనేక రాజకీయ చర్యలు తీసుకోవడం, వివిధ వర్గాలకు చెందిన ప్రజల భావోద్వేగాలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు తీవ్ర చేశారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజమైతే యూపీలో బిజెపికి సరైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుం చడంలో ప్రతిపక్షాలు విఫలం అయినట్లే. కేంద్రంలో మోదీ విధానాలు, ఆదిత్యనాథ్ అయిదేళ్ల పాలన పట్ల వ్యతిరేకతనే ప్రతిపక్షాలు ఉపయోగించుకోలేక పోయాయని అంటున్నారు. జాతీయస్థాయిలోను, వివిధ రాష్టాల్లోన్రు బిజెపిని ఎదుర్కోవడానికి కొత్త ఎజెండాను, వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉన్న తరుణంలో యూపిలో ఐక్యత సాధించలేక పోయారు. యూపీలో బిజెపి గెలిచినంత మాత్రాన 2024లో బిజెపికి బలమైన ప్రత్యామ్నాయం రాదని చెప్పలేమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వాదనగా ఉంది. ఈ ఫళితాలు వేరు..రేపటి సార్వత్రిక ఎన్నికలు వేరన్న సిద్దాంతంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఆయన వాదనను సిఎం కెసిఆర్ కూడా నమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి మరోసారి గెలిచినా తన వ్యూహాలను ముందుకు తీసుకుని వెళ్లడమే లక్ష్యంగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు సమాయత్తమైన ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పుడు కాంగ్రెస్ గొడుగు కింది మళ్లీ ఏకం కావాల్సిన ఆగత్యం మాత్రం తప్పదు. దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల తీరు తెన్నులను ప్రజలు చూస్తున్నారు. వీరిని నమ్మేంతగా లేదు. సమర్థ పాలన కారణంగానే బిజెపి వైపే మొగ్గు చూపడం ఇందుకు కారణాలుగా భావిస్తున్నారు. బిజెపిని మనువాద పార్టీ అని విమర్శించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఆ పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యారు. 1985లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 269 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ సంఖ్యాబలం 1989లో 94 సీట్లకు, 1991లో 46 సీట్లకు పడిపోవడానికి కారణం రాజీవ్ గాంధీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కారణమైతే బిజెపి బలపడడానికి కాంగ్రెస్ వైఫల్యమే కాదు, బిసి`దళిత ఐక్యత విఫలం కావడం కూడా కారణంగా చెప్పుకోవాలి. ఏ సవిూకరణలైతే నాడు యూపీలో ప్రాబల్యం పెంచుకోవడానికి బిజెపికి ఉపయోగపడ్డాయో, ఇప్పుడూ అవే సవిూకరణలు పార్టీకి ఉపయోగ పడుతున్నాయి. ఈ క్రమంలోనే మరోమారు యోగి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏ మేరకు విపక్షాలు ఐక్యత సాధిస్తాయో అన్నది సర్వత్రా ఉత్కంఠగామారింది.