యూపీలో భారీ వర్షాలు

– నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
– వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం
– వర్షాల కారణంగా 43మంది మృతి
– వరదల పరిస్థితిపై సవిూక్షించిన సీఎం ఆధిత్యనాధ్‌
లక్నో, జులై28(జ‌నం సాక్షి) : ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెతుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయఇ. పలు ప్రాంతాల్లో వర్సాల కారణంగా 43 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా ఆగ్రాలో ఎక్కువ మంది మృతిచెందారు. బరేలీ, కాన్పూర్‌ దెహత్‌, మథుర, ఘజియాబాద్‌, హాపూర్‌, రాయ్‌బరేలీ, జలౌన్‌, జానపూర్‌, ఫిరోజ్‌బాద్‌, బులంద్‌షహార్‌, ముజఫర్‌నగర్‌లోనూ వర్షాల కారణంగా పలువురు మృతిచెందారు. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వర్షాల కారణంగా ట్రాఫిక్‌, విద్యుత్‌ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. వరదల పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సవిూక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. మరోవైపు యూపీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. యూపీ సహా దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
——————————–